: హైదరాబాదులో ఘోరం...కూతురుపై కక్ష కట్టిన కన్నతల్లి!


హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ఇప్పటికే ఐదు వివాహాలు చేసుకున్న అస్మా ఫర్తోస్ అనే మహిళ కన్న కుమార్తె ఉమెరా బేగంతో వ్యభిచారం చేయించింది. డిగ్రీ పూర్తి చేసిన ఉమేరాను స్టార్ హోటళ్లలో విటుల వద్దకు పంపడం ప్రారంభించింది. తర్వాత కుమార్తె ఎదురు తిరగడంతో ఉమెరాకు మత్తుమందు ఇచ్చి ఇంటికే విటులను పిలిపించుకునేది. తల్లి ఆగడాలు భరించలేకపోయిన ఉమెరా, మత్తు దిగిపోవడంతో ఇంటి నుంచి పలుమార్లు పారిపోయింది. తల్లికి తెలియకుండా బయటకు వెళ్తే తన అనుచరులతో కొట్టించేది. దీంతో తెలిసిన బంధువులను ఆశ్రయించి తల్లి అసలు స్వరూపాన్ని వివరించింది. దీంతో నిర్ఘాంతపోయిన ఆ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన అస్మా, 'లక్ష రూపాయలు ఇస్తాను, నా కూతుర్ని ఎన్ కౌంటర్ చేయండి' అంటూ పోలీసులను కోరిందని బాధితురాలు ఉమెరా తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News