: మనదేశంలో చాలా తక్కువ సినిమా థియేటర్లు ఉన్నాయి: సల్మాన్ ఖాన్


మన దేశంలో చాలా తక్కువ సినిమా హాళ్లు ఉన్నాయని, మరిన్ని థియేటర్లు నిర్మించాల్సిన అవసరం ఉందని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అన్నాడు. నగరాల మధ్యలో థియేటర్లు నిర్మించడమంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చుతో కూడుకున్నది కనుక నగర శివార్లలో సినిమా హాళ్లు నిర్మించాలని సూచించాడు. మన దేశంలో సినిమా థియేటర్లు లేని ప్రాంతాలు చాలానే ఉన్నాయని, నగర శివార్లలో వాటిని నిర్మించుకుంటే బాగుంటుందని అన్నాడు. కాగా, అలీ అబ్బాస్ జహీర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సుల్తాన్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్నాడు.

  • Loading...

More Telugu News