: హ‌మ్మ‌య్య.. ఎండ‌లు కాస్త తగ్గాయి!


భానుడి ప్రతాపంతో గ‌జ‌గ‌జ‌లాడుతోన్న‌ తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త‌ తగ్గాయి. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు త‌గ్గగా, కొన్ని చోట్ల మాత్రం రాత్రిపూట మాత్రం అధిక ఉష్ణోగ్రతలే కొనసాగుతున్నాయి. అనంతపురం 41.2 డిగ్రీలు, కాకినాడ 34.6 డిగ్రీలు, కళింగపట్నం 33.5 డిగ్రీలు, మచిలీపట్నం 33.6 డిగ్రీలు, నెల్లూరు 36.3 డిగ్రీలు, ఒంగోలు 34.1 డిగ్రీలు, తిరుపతి 40.4 డిగ్రీలు, విజయవాడ 37.3 డిగ్రీలు, విశాఖపట్నం 31.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి. అలాగే హైదరాబాద్ 39.2 డిగ్రీలు, నిజామాబాద్ 41.5 డిగ్రీలు, రామగుండం 40.2 డిగ్రీలు నమోదు అయ్యాయి. రెండు రోజుల ముందు నందిగామలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలోని నిజామాబాద్ లో అత్యధికంగా 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News