: రిటైర్మెంట్ పై మాట మార్చేసిన పాక్ కెప్టెన్ అఫ్రిది
క్రికెట్ ఆట నుంచి వైదొలగే విషయంలో పాక్ కెప్టెన్ అఫ్రిది మాట మార్చాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి విరమించుకునే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు. వరల్డ్ కప్ టీ-20లో భారత్ పై మ్యాచ్ ని ఓడిపోయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, ఈ టోర్నమెంటే తనకు ఆఖరిదని, ఆస్ట్రేలియాతో పోరు తరువాత తానింక ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడబోనని ప్రకటించిన అఫ్రిది ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. తిరిగి పాక్ కు వెళ్లిన తరువాత దేశ ప్రజలు, అభిమానులతో చర్చించి నిర్ణయాన్ని తీసుకుంటానని అన్నాడు. కాగా, టీ-20 పోరు అనంతరం అఫ్రిదిని కెప్టెన్సీ పదవి నుంచి తప్పించనున్నట్టు పీసీబీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.