: ఈస్టర్ వీక్... వివిధ మతాల శరణార్థుల పాదాలను ముద్దాడిన పోప్!
ఈస్టర్ వీక్ లో భాగంగా శరణార్థుల పాదాలను పోప్ ఫ్రాన్సిస్ కడిగారు. టవల్ తో తుడిచిన అనంతరం వారి పాదాలను ఆయన ముద్దాడారు. నిన్న రోమ్ కు సమీపంలో ఉన్న క్యాజిల్నువో ది పోర్తో లోని ఒక శరణార్థ శిబిరంలోని క్యాథలిక్కులు, ముస్లిం, హిందూ, ఇటాలియన్, ఎరిత్రియా శరణార్థుల పాదాలను ఆయన కడిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శరణార్థుల శ్రేయస్సు కోసం యూరోప్ దేశాలు ముందుకు రావాలని కోరారు. మనమందరం అన్నదమ్ములమని, శాంతియుత వాతావరణంలో జీవిద్దామని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.