: తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా వెలగపూడి వద్ద జరుగుతున్న తాత్కాలిక సచివాలయ పనులను విహంగ వీక్షణం చేశారు. విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి హెలికాప్టర్ లో వెళ్లిన సీఎం చంద్రబాబు ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజి సంస్థలు శరవేగంగా పూర్తి చేస్తున్న తాత్కాలిక రాజధాని పనులను పరిశీలించారు. నిర్మాణ పురోగతి పనులను మంత్రి నారాయణ సీఎంకు వివరించారు. జూన్ నాటికి ఏపీ తాత్కాలిక రాజధాని నిర్మాణం పూర్తి కానుందని అధికారులు చెబుతున్నారు. వీటిని పరిశీలించిన అనంతరం గుత్తేదారులతో సీఎం మాట్లాడారు. మధ్యాహ్నం సీఎం సీఆర్డీఏ అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భవనాలకు సంబంధించిన డిజైన్లను పరిశీలించి, ఖరారు చేస్తారు.

  • Loading...

More Telugu News