: ప్రజా సమస్యలపై చర్చించాలన్న ధ్యాస చంద్రబాబుకు లేదు: వైఎస్సార్సీపీ
శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాలన్న ధ్యాస ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అనంతపురంలో విలేకరులతో ఈరోజు ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి మూడు బడ్జెట్ లు ప్రవేశపెట్టినా చంద్రబాబు రైతు రుణమాఫీ చేయలేకపోయారని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. నవ్యాంధ్ర రాజధాని భూ కుంభకోణాలకు సంబంధించిన వార్తలను రాసిన విలేకరులను బెదిరిస్తున్నారని, తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు.