: జర్నలిస్టు చెంప ఛెళ్లుమనిపించిన సన్నీలియోన్!


గుజరాత్ లోని సూరత్ లో నిన్న ‘సన్నీలియోన్ తో హోలీ’ అనే కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన సన్నీ లియోన్ అక్కడ ఓ జర్నలిస్టు చెంపను ఛెళ్లు మనిపించింది. నేషనల్ న్యూస్ ఛానల్ కు చెందిన ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఆమెకు కోపం తెప్పించింది. అంతే, సదరు జర్నలిస్టు చెంపపై ఐదేళ్లు పడేలా సన్నీ చాచి కొట్టింది. ఆమె క్యారెక్టర్ని ఎగతాళి చేస్తూ సదరు జర్నలిస్టు వేసిన ఓ ప్రశ్న ఆమెకు అంతటి కోపాన్ని తెప్పించింది. సూరత్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ కారిడార్ లో నిన్న ఆమెను ఇంటర్వ్యూ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. కాగా, నిన్న ఉదయం సన్నీలియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ ఇక్కడికి వచ్చారు. వారు హోటల్ గదిలో ఉండగా, ఒక వ్యక్తి ఫుల్ గా తాగి వారి గదిలోకి వెళ్లి, సన్నీ లియోన్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. కష్టం మీద సదరు వ్యక్తిని బయటకు పంపారు. ఆ తర్వాత హోటల్ కారిడార్ లో జర్నలిస్టు ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ ఈ ప్రశ్న వేశాడు. అప్పటికే మండిపడుతున్న సన్నీ లియోన్ కు ఈ ప్రశ్న మరింత కోపం తెప్పించింది. దాంతో కంట్రోల్ తప్పి అతనికి ఒక్కటిచ్చింది. ఈ సంఘటనపై భర్త డేనియల్ మాట్లాడుతూ, సన్నీలియోన్ స్పందించిన తీరు సబబేనని వెనుకేసుకొచ్చాడు.

  • Loading...

More Telugu News