: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. సెమీస్‌కు చేరడమే లక్ష్యంగా రంగంలోకి దిగిన ఇరు జట్లు
మొహాలీ వేదికగా టీ20 వరల్డ్‌కప్ పోరులో భాగంగా పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ మూడు గంటలకు ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ పోరులో మిగిలిన ఏడు జట్లలో సెమీస్ కు చేరడానికి మూడు జట్లకే అవకాశాలు ఉండటంతో నేటి మ్యాచ్‌ల పట్ల అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే నేడు పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కీలకంగా మారడంతో ఎలాగైనా విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్ పట్ల ఇండియా అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే..ఒకవేళ ఈ మ్యాచ్ లో పాక్ గెలిచి, ఆపై భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిస్తే ఇండియా టోర్నీ నుంచి తప్పుకున్నట్టే. ఎందుకంటే, ఈ రెండు దేశాల నెట్ రన్ రేట్ ఇండియా కన్నా ఎక్కువగా ఉంది.