: రోజుకో మ‌లుపు తిరుగుతున్న‌ ఉత్త‌రాఖండ్ రాజ‌కీయాలు.. హైకోర్టులో రెబల్స్ పిటిష‌న్


ఉత్త‌రాఖండ్‌లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి తిరుగుబాటు చేసిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలకు కొన్నిరోజుల ముందు ఆ రాష్ట్ర‌ శాసనసభ స్పీకర్‌ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. వారిని సభనుంచి అనర్హులుగా ఎందుకు ప్రకటించరాదో తెలియజేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా, అసెంబ్లీ స్పీకర్ త‌మ‌కు నోటీసులు పంపడంపై రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా స్పీక‌ర్ త‌మ‌కు నోటీసులు పంపార‌ని మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి హ‌ర‌క్ సింగ్ రావ‌త్ అన్నారు. ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ సర్కారు మైనారిటీలో పడిందన్న బీజేపీ వాదన నేపథ్యంలో.. మార్చి 28 లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం హరీశ్ రావత్‌ను రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ పాల్ ఆదేశించారు. బడ్జెట్‌పై ఓటింగ్ సందర్భంగా శుక్రవారం 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి సభలో ధర్నా చేయడం, అనంతరం గవర్నర్‌ను కలసిన బీజేపీ ప్రతినిధి బృందం మైనారిటీలో పడిన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే. ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతోన్న ఉత్త‌రాఖండ్ రాజ‌కీయాలు ఎటువైపు వెళ్లనున్నాయ‌న్న అంశంపై స‌ర్వ‌త్ర ఆస‌క్తి నెల‌కొంది.

  • Loading...

More Telugu News