: ఇదెక్కడి న్యాయం?... హెచ్ సీయూ విద్యార్థుల అరెస్ట్ పై రోహిత్ తల్లి ఆవేదన


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అరెస్ట్ లపై రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులోని ఎన్ఎస్ఎస్ కేంద్రంలో కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా కేసులు పెట్టిన తర్వాత అరెస్టులు చేస్తారని, అయితే హెచ్ సీయూ విద్యార్థుల విషయంలో మాత్రం ఆ పధ్ధతి తారుమారైందని ఆమె వాపోయారు. వర్సిటీ వీసీ అప్పారావుకు వత్తాసు పలుకుతున్న పోలీసులు ప్రస్తుతం జైల్లో ఉన్న విద్యార్థులపై ఎలాంటి కేసులు పెడితే బాగుంటుందన్న విషయాన్ని పరిశీలిస్తున్నారని ఆమె ఆరోపించారు. విద్యార్థులు బయటపడేందుకు వీలులేని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తక్షణమే అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయడంతో పాటు తన కొడుకు ఆత్మహత్యకు కారకుడైన వీసీ అప్పారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News