: కొల్లేరు సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్తా: నిర్మలా సీతారామన్


కొల్లేరు సమస్యను ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ దృష్టికి తీసుకెళ్తాన‌ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్ర‌వారం ఆమె పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కొల్లేరులో రైతుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. కొల్లేరు సమస్య కొన్ని దశాబ్దాలుగా ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఎంపీ గోకరాజు గంగరాజు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు.. నిర్మ‌లా సీత‌రామ‌న్‌తో క‌లిసి రైతుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News