: మరో మూడు రోజుల్లో తాత్కాలిక రాజధాని ఫౌండేషన్ పూర్తి: మంత్రి నారాయణ
నవ్యాంద్ర నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఏపీ పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీఏ చైర్మన్ పి.నారాయణ చెప్పారు. సీఎం నారా చంద్రబాబునాయుడు తాత్కాలిక సచివాలయ పనుల పర్యవేక్షణకు మరికాసేపట్లో బయలుదేరుతున్న తరుణంలో ఆయన ఓ న్యూస్ చానెల్ తో మాట్లాడారు. తాత్కాలిక రాజధాని పనుల్లో భాగంగా 945 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికే 807 పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యిందని ఆయన చెప్పారు. ఇంకా 138 పిల్లర్లను నిర్మించాల్సి ఉందన్నారు. మరో మూడు రోజుల్లో తత్కాలిక రాజధాని నిర్మాణాల ఫౌండేషన్ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.