: దేవుడి పట్ల నమ్మకం మెదడుపై ప్రభావం చూపుతుందట... కొత్త రీసెర్చ్ లో ఆసక్తికర అంశాలు!


మీరు దేవుడిని నమ్ముతారా? అయితే మీలో సానుభూతి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయాన్ని విశ్లేషించడంలో ముందుంటారు. భౌతిక ప్రపంచం గురించి కొంత వ్యతిరేక ధోరణిలో ఉంటారు. నమ్మకం గురించిన ప్రశ్న ఉదయించినప్పుడు అది అసంబద్ధమైనదిగా కనిపిస్తుంది. ఈ విషయాలన్నీ ఎనిమిది రకాల ప్రయోగాలను దాదాపు 500 మందిపై జరిపి రీసెర్చర్లు కనుగొన్నారు. 'ప్లస్ వన్' జర్నల్ లో వీరి అధ్యయనం వివరాలు ప్రచురితం కాగా, దేవుడిపై నమ్మకం ఉన్న వారికి సానుభూతి అధికంగా ఉంటుందని రీసెర్చ్ కి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ టోనీ జాక్ వెల్లడించారు. "మెదడులో విశ్లేషణాత్మ శక్తికి, దైవంపై నమ్మకానికీ సంబంధం ఉంది. మానవాతీత శక్తి ఒకటి ఉందని నమ్మేవారిలో సామాజిక, మానసిక అంతర్ దృష్టి అధికం" అని ఆయన అన్నారు. ప్రజల్లో దైవారాధన, ధ్యానం తదితర అలవాట్లున్న వారిలో సానుభూతి, నమ్మకాలు పాజిటివ్ దృక్పథంలో ఉంటాయని వివరించారు. మెదడులోని న్యూరానులు రెండు పరస్పర విభిన్న నెట్ వర్కులను కలిగివుంటాయని, సామాజిక, విమర్శనాత్మక భావాలు వీటి ద్వారా వ్యక్తమవుతుంటాయని పేర్కొన్నారు. భౌతిక సమస్య ఏర్పడినా, నైతిక గందరగోళం ఏర్పడినా న్యూరానుల నెట్ వర్క్ పని చేస్తుందని ఆ సమయంలో ఏ నెట్ వర్క్ విజయం సాధిస్తుందన్న విషయాన్ని దేవుడిపై ఉండే నమ్మకం ప్రభావితం చేస్తుందని తెలిపారు. కాబట్టి మత పరమైన వ్యవహారాలు, దైవారాధన కారణంగా మెదడులో మరింత సమతుల్యం సాధించవచ్చని తెలియజేశారు.

  • Loading...

More Telugu News