: రాజకీయంగా నన్ను నాశనం చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు: రోజా ఆరోపణ


వైసీపీ మహిళా నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. మొన్న అసెంబ్లీ బయట మండుటెండలో గంటల తరబడి నిరసన దీక్ష చేపట్టిన ఆమె నీరసించి ఫుట్ పాత్ పైనే పడుకుండిపోయారు. ఆ తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు ఎట్టకేలకు దీక్ష విరమించి అంబులెన్స్ ఎక్కారు. నిమ్స్ లో చికిత్స తీసుకున్న ఆమె తాజాగా కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాదు లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై సంచలన ఆరోపణలు చేశారు. తనను రాజకీయంగా నాశనం చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏపీలో కలకలం రేపిన కాల్ మనీ సెక్స్ రాకెట్ లో టీడీపీ నేతల ప్రమేయముందని, దానిపై చర్చకు డిమాండ్ చేయడమే తాను చేసిన తప్పని ఆమె వాపోయారు. సభలో అధికార పక్షం విపక్షం గొంతు నొక్కేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఇక మీడియా సంస్థలు తనపై ఇష్టానుసారంగా కథనాలు రాస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News