: భారత కంపెనీకి పనిచ్చినందుకు అమెరికా కంపెనీకి రూ. 20 కోట్ల జరిమానా!


ఓ ఇండియన్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టు విధానంలో పని అప్పగించినందుకు అమెరికన్ సంస్థపై రూ. 20.72 కోట్ల జరిమానా పడింది. వివరాల్లోకి వెళితే, ఫోకస్డ్ టెక్నాలజీస్ ఇమేజింగ్ సర్వీసెస్ అనే సంస్థ 2.2 కోట్ల మంది వేలిముద్రలను డిజిటలైజ్ చేయాలన్న ప్రభుత్వ కాంట్రాక్టును దక్కించుకుంది. దీని యజమానులైన చార్లెస్ టాబిన్, జూలీ బెన్ వేర్ లు ఆ పనిని ముంబైకి చెందిన ఓ కంపెనీకి సబ్ కాంట్రాక్టు ఇచ్చి సుమారు రూ. 55 లక్షలు చెల్లించి పని చేయించుకున్నారు. దీంతో, డిజిటలైజ్డ్ డేటాబేస్ లో సురక్షితంగా ఉండాల్సిన పౌరుల సమాచారం విదేశాలకు పంపడం ఆ సంస్థ చేసిన తప్పని, ప్రభుత్వ నిధులతో పూర్తి చేయాల్సిన పనిని చట్ట విరుద్ధంగా వ్యవహరించి ఇండియాకు అప్పగించారని కేసు పెట్టిన అధికారులు విచారణ జరిపించారు. తాము ఔట్ సోర్సింగ్ విధానంలో కాంట్రాక్టును పూర్తి చేసినట్టు తెలియకుండా చూడాలని కూడా ఫోకస్డ్ టెక్నాలజీస్ ప్రయత్నించింది. దీంతో ఆ సంస్థకు భారీ జరిమానా విధించామని, దాన్ని చెల్లించేందుకు వారు అంగీకరించారని అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News