: తన కోరికల కోసం బిడ్డలనే వదిలించుకోవాలనుకుంది!: ఇంద్రాణిపై భర్త ఆరోపణలు


తనకున్న అతి కోరికలను తీర్చుకునేందుకు సొంత పిల్లలను వదిలించుకోవాలని తన భార్య ఇంద్రాణి భావించిందని పీటర్ ముఖర్జియా తెలిపారు. ఒకప్పుడు ప్రసార మాధ్యమ సంస్థలకు దిక్సూచిగా నిలిచి, ఓ వెలుగు వెలిగి, ఇప్పుడు షీనా బోరా హత్య కేసులో నిందితుడిగా జైల్లో ఉన్న ఆయన బెయిల్ పిటిషన్ విచారణకు రాగా, భార్యకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పీటర్ న్యాయవాది కుశాల్ మోర్ 32 పేజీల డాక్యుమెంట్ ను దాఖలు చేశారు. తాను స్వశక్తితో ఎదిగి ఎంతో పేరు తెచ్చుకున్నానని, సంఘంలో తనకెంతో గౌరవముందని తెలిపారు. ఇంద్రాణి మాయలో పడి, ఆమె కుటుంబ నేపథ్యం గురించి ఎంతమాత్రమూ తెలుసుకోలేదని, దాంతోనే జైలుపాలయ్యానని వాపోయారు. జరిగిన హత్య వల్ల తనకేమీ ప్రయోజనాలు, లాభాలు లేవని కోర్టు గుర్తెరగాలని కోరారు. కాగా, ఈ కేసు తదుపరి విచారణ మార్చి 31కి వాయిదా పడింది.

  • Loading...

More Telugu News