: పాక్ మాజీ ప్రధాని గిలానీ కూడా మా ఇంటికొచ్చాడు: విచారణలో హెడ్లీ సంచలన వ్యాఖ్య
ముంబై దాడుల కీలక నిందితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ నేటి ఉదయం పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. వందలాది మందిని బలిగొన్న ముంబై మారణహోమానికి సంబంధించిన రెక్కీ నిర్వహించి, ఉగ్రవాదులకు కీలక సమాచారమిచ్చిన అతడు... దాడుల తర్వాత ఎంచక్కా అమెరికా చెక్కేశాడు. అయితే అక్కడి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విడతలవారీగా జరిగిన చర్చల ఫలితంగా అతడు అప్రూవర్ గా మారాడు. ఈ క్రమంలో ముంబైలోని కోర్టు... అమెరికాలో ఉన్న అతడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ దఫా విచారణ పూర్తి కాగా, తాజాగా మలివిడత జరుగుతోంది. ఇందులో భాగంగా నేటి ఉదయం జరిగిన విచారణ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలను హెడ్లీ వెల్లడించాడు. హెడ్లీ తండ్రి రేడియో పాకిస్థాన్ కు డైరెక్టర్ గా పనిచేశారు. 2008 డిసెంబర్ లో హెడ్లీ తండ్రి మరణించారు. ఆ సందర్భంగా అప్పటి పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ తమ ఇంటికి వచ్చారని హెడ్లీ నేటి విచారణలో చెప్పాడు.