: గుండెలో స్ట్రా వేసి రక్తం తాగడమే!... కాల్ మనీ వ్యాపారంపై రఘువీరా వ్యాఖ్య
తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపీలో పెను కలకలం రేపిన కాల్ మనీ వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నేటి ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిక వడ్డీలకు అప్పులిచ్చి వడ్డీ సహా అసలును వసూలు చేసుకునేందుకు కాల్ మనీ వ్యాపారులు పాల్పడిన వేధింపులతో రఘువీరా సొంత జిల్లా అనంతపురంలో ఆయన అనుచరుడు సాయి ప్రసాద్ మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సాయిప్రసాద్ కుటుంబాన్ని నేటి ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వందకు 12 రూపాయల వడ్డీ అంటే... గుండెలో స్ట్రా వేసి రక్తం తాగడమేనని ఆయన వ్యాఖ్యానించారు. కాల్ మనీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.