: మంత్రి పదవి కోసమే అనిత సన్నాయి నొక్కులు: వైకాపా నేత బాబూరావు


మంత్రి పదవిని పొందడమే లక్ష్యంగా పెట్టుకున్న పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మొసలి కన్నీరు కారుస్తున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు విమర్శించారు. చంద్రబాబు వద్ద ఎలాగైనా సానుభూతి సంపాదించడమే లక్ష్యంగా, మహిళా శాసన సభ్యురాలు రోజా అనని మాటలను ఆపాదించుకున్నారని ఆయన అన్నారు. తన కుటుంబానికి ఉన్న సమస్యను మొత్తం దళితుల సమస్యగా చూపుతున్నారని, ఇప్పటికైనా ఆమె నియోజకవర్గ ప్రజల మేలు కోసం కృషి చేయాలని సూచించారు. అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు కౌరవులను తలపిస్తోందని, చివరికి విజయం వైకాపాదేనని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News