: అమరావతిలో ప్రభుత్వ భవనాల డిజైన్ ఖరారు నేడే!... జ్యూరీ కమిటీతో చంద్రబాబు కీలక భేటీ
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక రాజధాని నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను పరిశీలించేందుకు నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వెలగపూడి వెళుతున్నారు. జూన్ నాటికి తాత్కాలిక రాజధాని దాదాపుగా పూర్తి కానుంది. ఇక శాశ్వత నిర్మాణాలపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో అమరావతిలో రూపుదిద్దుకోనున్న ప్రభుత్వ భవనాల డిజైన్ ఎలా ఉండాలన్న అంశంపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఆయన జ్యూరీ కమిటీతో ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు. ప్రభుత్వ భవనాల డిజైన్ కు సంబంధించి జ్యూరీ కమిటీ పలు డిజైన్లను సిద్ధం చేసింది. వాటన్నింటినీ పరిశీలించనున్న చంద్రబాబు వీటిలో ఒకదానికి తన ఆమోద ముద్ర వేస్తారు.