: ఆనం కుటుంబంలో చిచ్చు పెట్టిన జగన్: సోమిరెడ్డి నిప్పులు


నెల్లూరు జిల్లాలో బలమైన ప్రజాబలం బాగున్న ఆనం కుటుంబంలో వైకాపా నేత జగన్ చిచ్చు పెట్టారని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇటీవల ఆనం సోదరుల్లో వివేకానందరెడ్డి, రామనారాయణ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న విజయకుమార్ రెడ్డి జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై స్పందించిన సోమిరెడ్డి, వైఎస్ కుటుంబానికి విశ్వసనీయతే లేదని, గతంలో వైఎస్ కాంగ్రెస్ ను వదిలి ఇందిరా కాంగ్రెస్ లో చేరితే, జగన్ సోనియాను మోసం చేశారని సోమిరెడ్డి దుయ్యబట్టారు. ప్రజలు జగన్ ను ఇప్పటికే అధికారానికి దూరం పెట్టారని, తదుపరి పూర్తిగా తరిమికొడతారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News