: యూరప్ లోకి 400 మంది ఐఎస్ ఉగ్రవాదుల ఎంట్రీ?... ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ప్యారిస్ పోలీసులు!


మొన్న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, నిన్న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్... వరుస ఉగ్రవాద దాడులతో యూరప్ హడలెత్తిపోతోంది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నిన్న ప్యారిస్ లో ముమ్మర సోదాలు చేసిన పోలీసులు ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. సదరు ఉగ్రవాది నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా అతడు ప్యారిస్ లో మరోమారు పంజా విసిరేందుకే ఎంటరయ్యాడని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో పలు దేశాలకు చెందిన నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ సందర్భంగా ఐఎస్ ఉగ్రవాద సంస్థకు చెందిన 400 మంది ముష్కరులు యూరప్ దేశాల్లోకి ఎంటరయ్యారన్న సమాచారం ఆయా దేశాలను వణికిస్తోంది. నిఘా వర్గాల హెచ్చరికలతో ఆయా దేశాల పోలీసులు పలు కీలక ప్రాంతాల్లో ఉగ్రవాద కదలికలపై ఓ కన్నేసి ఉంచారు.

  • Loading...

More Telugu News