: బ్రస్సెల్స్ విమానాశ్రయంలో బాంబు పెట్టిన ఉగ్రవాది ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు: భద్రతా దళాలు


ఉగ్రవాదులు అంటే కర్కశంగా ఉంటారు...వారి ముఖంలో తెలియని కసి, అసంతృప్తి కనబడుతూ ఉంటాయని మానసిక నిపుణులు పేర్కొంటారు. అయితే అందుకు భిన్నంగా బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ విమానాశ్రయంలో పేలుళ్లకు పాల్పడిన సోదరుల్లో ఒకడైన ఇబ్రహీం ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఆఖరుకి పోలీసులు పట్టుకున్నప్పుడు కూడా నవ్వుతూ కనిపించాడు. ఎప్పుడూ సరదాగా ఉండే ఇబ్రహీం గతేడాది సిరియా వెళ్లేందుకు టర్కీ వెళ్లి అక్కడి భద్రతా సిబ్బందికి చిక్కి వారి ఆదేశాలతో వెనుదిరిగాడు. అదే ఏడాది రెండోసారి అలాంటి ప్రయత్నం చేసి మళ్లీ టర్కీ పోలీసులకు దొరికిపోయాడు. దీంతో అతనిని బెల్జియం పంపిన టర్కీ పోలీసులు, అక్కడి భద్రతా దళాలను హెచ్చరించాయి. అతనిపై ఓ కన్నేసి ఉంచాలని సూచించాయి. అయితే అతను ఎటువంటి నేరం చేయలేదు కనుక అతనిని అరెస్టు చేసే అవకాశం లేదని వారు తేల్చారు. దీంతో ఈసారి దేశం దాటకుండానే అలా నవ్వుతూనే, చాలా మంది జీవితాలను నాశనం చేసేశాడు.

  • Loading...

More Telugu News