: ఫుల్లుగా మందు కొట్టి హల్ చల్ చేసిన టాలీవుడ్ వర్థమాన నటుడు
'ఫేస్ బుక్' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన వర్థమాన నటుడు ఉదయ్ కిరణ్ అలియాస్ బాబీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని జూబ్లిహిల్స్ దసపల్లా హోటల్ లో ఫుల్లుగా మద్యం తాగి హల్ చల్ చేశాడు. హోటల్ సిబ్బందిపై దాడికి దిగిన ఉదయ్ కిరణ్, అక్కడే ఉన్న మహిళలతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగని ఉదయ్ కిరణ్ హోటల్ అద్దాలు పగులగొట్టాడు. దీంతో హోటల్ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, హోటల్ వారు తన సెక్యూరిటీని కూడా లోపలికి రానివ్వలేదని ఆరోపించాడు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పాడు. సినిమా స్టార్ నని తనపై కుట్రపన్నారని ఆయన చెప్పాడు. అనూష్ అనే వ్యక్తి దొంగ కార్లు అమ్ముతున్నాడని, అతను దసపల్లా హోటల్ వారితో కుమ్మక్కై తనపై కేసుపెట్టాడని ఆయన ఆరోపించాడు. కాగా, గతంలో ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే.