: మాకు తెలుగు సినిమాల డీవీడీలు మహేశ్ బాబు పంపిస్తారు: కరీనా కపూర్


అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చూస్తుంటానని బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ తెలిపింది. 'కీ అండ్ కా' సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాదు వచ్చిన సందర్భంగా బెబో (కరీనా ముద్దుపేరు) మాట్లాడుతూ, టాలీవుడ్ లో తన ఫేవరేట్ మహేశ్ బాబు అని చెప్పింది. తన భర్త సైఫ్ కు, తనకు టాలీవుడ్ అగ్రనటుడు మహేశ్ బాబుతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపింది. తెలుగులో ఏవైనా హిట్ సినిమాలు చూడాలని ఉందని చెబితే, ఎంపిక చేసిన తెలుగు సినిమాల డీవీడీలను మహేశ్ బాబు వెంటనే పంపిస్తాడని కరీనా చెప్పింది. తెలుగులో నటించాలని ఉంది కానీ భాషాపరమైన సమస్య వల్ల నటించడం లేదని తెలిపింది.

  • Loading...

More Telugu News