: ప్రకాశం జిల్లా అద్దంకి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం


ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్నకొత్త పల్లి వద్ద రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా జడ్ పల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రోడ్డుపై వెళ్తున్న కారు...పక్కనే ఉన్న పంటపొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ప్రయాణికులు పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయారు. వేగంగా బయటకు పడిపోవడంతో వారంతా మృతి చెందారని తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పొస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News