: మహిళలకు క్షేమదాయకంకాని నగరాల జాబితాలో న్యూఢిల్లీ !
ప్రజా రవాణా వ్యవస్థ పరంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు ప్రమాదకరమైన 16 నగరాల జాబితాలో మన దేశ రాజధాని ఢిల్లీ నాలుగవ స్థానంలో ఉంది. ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయమై ది థామ్సన్ రాయిటర్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా ప్రపంచంలోని 16 దేశాల రాజధాని నగరాల్లో సుమారు 6,550 మంది మహిళలను ప్రశ్నించింది. ముఖ్యంగా బ్రిటన్ రాజధాని లండన్ లోని ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణించే 18-34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 41 శాతం మంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఆ సర్వేలో తేలింది. ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ నగరాలు... బొగోటా(కొలంబియా), మెక్సికో నగరం(మెక్సికో), లిమా(పెరూ), న్యూఢిల్లీ(భారత్), జకార్తా(ఇండోనేషియా), బ్యూనస్ ఎయిరస్ (అర్జెంటీనా), కౌలాలంపూర్( మలేసియా), బ్యాంకాక్(థాయిలాండ్), మాస్కో(రష్యా), మనీలా(ఫిలిప్పీన్స్), పారిస్(ఫ్రాన్స్), సియోల్(దక్షిణ కొరియా), లండన్(బ్రిటన్), బీజింగ్(చైనా), టోక్యో(జపాన్), న్యూయార్క్ (అమెరికా) ఉన్నాయి.