: గాడిదపై ఊరేగితే మగపిల్లలు పుడ‌తారట... గుజ‌రాత్‌లో వింత న‌మ్మ‌కం!


భారత్ ఎంతగా అభివృద్ధి చేడుతున్నా, చాలా మంది భార‌తీయుల్లో ఎన్నో మూఢ నమ్మకాలు ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో నేటికీ అటువంటి ఆచారం ఒకటి కొనసాగుతోంది. అదే.. గాడిదపై ఊరేగితే మగపిల్లలు పుడతారన్న న‌మ్మ‌కం! అందుకే, ఆ గ్రామంలో గాడిదలకు నేటికీ గిరాకీ కొనసాగడమే కాదు... దానిపై ఊరేగేందుకు ప్రజలు ఏకంగా వెయిటింగ్ లిస్టులో ఉండటం విశేషం. ప్రతీ హోలీ పండగ రోజున జునాగఢ్‌ జిల్లా బోర్వావ్‌ గ్రామంలోని పురుషులు గాడిదలపైకి ఎక్కి ఊరేగుతారు. మగ సంతానం లేని వారు హోలీ పండగ రోజు గాడిద మీద వూరేగుతూ భిక్షాటన చేస్తారు. తొలుత స్థానికంగా ఉండే పక్షులు, జంతువుల ఆహారం కోసం ఈ పద్ధతిని మొదలుపెట్టారు. రాను రాను అలా ఎక్కిన వారందరికీ మగపిల్లలు పుట్టడంతో గ్రామస్థులకు నమ్మకం పెరిగింది. ఈ గ్రామంలో రెండు గాడిదలుండగా.. వాటి మీద ఎక్కేందుకు స్థానికులు పోటీ పడుతుంటారు. ఈ ఆచారం దశాబ్దాలుగా కొడుకు పుట్టాలని కోరుతూ కొనసాగుతోందని ఆ గ్రామ‌వాసి ఒక‌రు చెప్పారు.

  • Loading...

More Telugu News