: ఆరడుగుల మోదీ వణికిపోతున్నాడు...వెంకయ్యనాయుడు బావిలో కప్ప!: సీపీఐ నారాయణ విసుర్లు


ఐదడుగుల కన్నయ్య కుమార్ ను చూస్తే, ఆరడుగుల మోదీ వణికిపోతున్నారని సీపీఐ నారాయణ ఎద్దేవా చేశారు. విజయవాడలో ఐవీ ప్యాలెస్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీకి ప్రజాస్వామ్యవాదులంటే వణుకు అని అన్నారు. అందుకే కన్నయ్య కుమార్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆందోళన చేయమని పార్టీ కార్యకర్తలకు చెబుతున్నారని ఆరోపించారు. ఇక కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బావిలో కప్ప అని ఆయన ఎద్దేవా చేశారు. నీతులు చెప్పడంలో ముందుండే వెంకయ్య నాయుడు ఆ పార్టీ నేతలు చేసిన ప్రతిఘటన పనులకు ఏమని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనల ద్వారా ప్రజలకు ఎవరు ప్రజాస్వామ్య పరిరక్షకులు? ఎవరు ప్రజాస్వామ్యానికి ముప్పు? అన్న విషయాలు అర్థమవుతాయని పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో కన్నయ్యకు వ్యతిరేకంగా బీజేపీ అర్థం లేని ఆందోళనలు చేస్తోందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News