: కన్నయ్య సభ వద్ద ఉద్రిక్తత...అడ్డుకున్న బీజేపీ... ప్రతిఘటిస్తున్న కార్యకర్తలు
కృష్ణా జిల్లా విజయవాడలోని ఐవీ ప్యాలెస్ వద్ద జేఎన్యూ స్టూడెంట్ లీడర్ కన్నయ్య కుమార్ సభా వేదిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. కన్నయ్య కుమార్ సభను అడ్డుకునేందుకు బీజేపీ ఆధ్వర్యంలోని బీజేవైఎంకు సంబంధించిన కార్యకర్తలు విడతలుగా వెళ్లి సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమావేశ మందిరం వేదిక వద్దకు సీపీఐ కార్యకర్తల ముసుగులో చేరుకున్న బీజేపీ కార్యకర్తలు సభను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వారిని కన్నయ్య మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.