: అర్జెంటీనా డ్యాన్సర్ తో బ‌రాక్ ఒబామా ట్యాంగో స్టెప్పులు... అదుర్స్!


అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిరస్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్య‌క్షుడు బరాక్ ఒబామా ఓ డిన్న‌ర్‌ పార్టీలో అర్జెంటీనా డ్యాన్సర్ తో కలిసి డ్యాన్స్‌ చేశారు. ఆయ‌న డ్యాన్స్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా, ఆయ‌న చేసింది సాదాసీదా నృత్యం కూడా కాదు.. అది ట్యాంగో డ్యాన్స్! ట్యాంగో మ్యూజిక్ కు అనుగుణంగా ఒబామా స్టెప్పులేస్తూ అందర్నీ ఉత్సాహపరచారు. డ్యాన్సర్ అమ్మాయిని అల్లుకుపోతూ ఒబామా చేసిన డ్యాన్స్ హాట్ టాపిక్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డిన్నర్ లో ఒబామా భార్య మిషెల్లీ కూడా ఉన్నారు. ముందు డ్యాన్సర్ తనతో కలిసి స్టెప్పులేయడానికి పిలిస్తే.. ఒబామా మొహమాట పడ్డారు. తర్వాత ఆయనే ముందుకొచ్చి డ్యాన్స్ చేశారు. పురుష డ్యాన్సర్‌ జోస్‌ లాగోన్స్‌తో కలిసి ఒబామా భార్య మిషెల్లీ కూడా చక్కగా స్టెప్పులు వేశారు. ఒబామా, మిషెల్లీ స్టెప్పులతో ఈ దౌత్యవేడుకలో కొత్త జోష్‌ వచ్చింది.

  • Loading...

More Telugu News