: ప్రియుడితో కలసి స్నేహితురాలి పెళ్లికి వెళ్లిన దీపికా పదుకునే!
ప్రియుడు రణ్ వీర్ సింగ్ తో కలసి దీపికా పదుకునే శ్రీలంకలో జరిగిన తన స్నేహితురాలి వివాహానికి హాజరైంది. ఈ విషయాన్ని దీపిక ఫ్యాన్స్ తెలుపుతూ, ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు. తల్లి ఉజ్జల పదుకునే, రణ్ వీర్ సింగ్ లతో కలసి దీపిక శ్రీలంక వెళ్లిందని ఆమె ఫ్యాన్స్ ట్వీట్ చేశారు. కాగా, రణ్ వీర్ 'బేఫికర్స్' సినిమాతో బిజీగా ఉండగా, దీపిక హాలీవుడ్ సినిమా 'ట్రిపుల్ ఎక్స్' సినిమాతో బిజీగా ఉంది.