: ఆ పేలుళ్ల గురించి నాకేం తెలియ‌దు: సలాహ్ అబ్దెస్లామ్‌


ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో మారణ హోమం సృష్టించిన ఉగ్రవాది సలాహ్ అబ్దెస్లామ్ అరెస్టుకు ప్ర‌తీకారంగానే ఉగ్ర‌వాదులు బ్ర‌స్సెల్స్‌పై దాడి జ‌రిపార‌ని అనుమానిస్తున్న‌ నేప‌థ్యంలో.. బ్ర‌స్సెల్స్ దాడిపై త‌న‌కేం తెలియ‌ద‌ని అబ్దెస్లామ్ తెలిపాడు. ఈ మేరకు అతడి తరఫున లాయర్‌ మీడియాకు వివరించారు. అబ్దెస్లామ్ అరెస్టైన రోజుల వ్యవధిలో ఈ పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో... అతడి అరెస్టుకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పారిస్‌లో గతేడాది నవంబర్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నిందితుడైన అబ్దెస్లామ్‌ను ఇటీవల బ్రసెల్స్‌లో అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News