: ఆపరేషన్ 'ఎయిర్ లిఫ్ట్'ను ప్రారంభించిన జెట్ ఎయిర్ వేస్


రెండు రోజుల క్రితం ఉగ్రదాడి జరిగిన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నుంచి భారతీయులను స్వదేశం చేర్చేందుకు జెట్ ఎయిర్ వేస్ ఆపరేషన్ 'ఎయిర్ లిఫ్ట్'ను ప్రారంభించింది. మంగళవారం నాటి దాడుల నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, భయభ్రాంతులకు గురైన భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు నడపనుంది. పేలుళ్లకు ముందు బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టులో జెట్ ఎయిర్ వేస్ విమానం ల్యాండ్ కాగా, ఆపై టేకాఫ్ కు అనుమతి లభించలేదు. ఇప్పుడందులో ప్రయాణించాల్సిన వారిని 15 బస్సుల ద్వారా ఆమ్ స్టర్ డామ్ కు చేర్చిన అధికారులు, సదరు విమానాన్ని సైతం ఆమ్ స్టర్ డామ్ కు పంపి, అక్కడి నుంచి ప్రయాణికులతో ఢిల్లీకి పంపారు. ఇదే సమయంలో ఇక్కడి నుంచి గాయపడ్డ జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగుల బంధువులను బ్రస్సెల్స్ చేర్చుతున్నట్టు సంస్థ చైర్మన్ నరేష్ గోయల్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. వీరంతా గురువారం రాత్రికి తమ గమ్యస్థానాలకు చేరుతారని వివరించారు.

  • Loading...

More Telugu News