: గురుదత్‌పై బయోపిక్‌ తీస్తే నటిస్తా: షారుఖ్‌ఖాన్


లెజెండరీ నటుడు గురుదత్‌పై బయోపిక్‌ తీస్తే అందులో త‌ప్ప‌క న‌టిస్తాన‌ని బాలీవుడ్ స్టార్‌ షారుక్ ఖాన్ అన్నాడు. ఓ ప్రఖ్యాత మ్యాగ్‌జైన్‌ ఎడిటర్‌తో ట్విట్టర్ ద్వారా సంభాషిస్తూ షారుఖ్‌ ఈ అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. గురుదత్‌పై బయోపిక్‌ తీస్తే మీరు నటిస్తారా అని అడిగిన ప్ర‌శ్న‌కు షారూఖ్ పాజిటివ్‌గా స్పందిస్తూ... త‌ప్ప‌క నటిస్తా.. నటించాల్సిందే.. అని రిప్లై ఇచ్చాడు. హిందీలో అద్భుత సినిమాలను ప్రేక్షకులకు అందించిన గురుదత్‌ 39 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన చనిపోయి 52 ఏళ్లు అవుతోంది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్‌ ని అమితంగా ప్రేమించే అభిమానులు ఎందరో ఉన్నారు. ఆయ‌న ఏ పాత్ర‌లో న‌టించినా నీరాజ‌నం ప‌డ‌తారు. అటువంటిది లెజెండరీ నటుడు గురుదత్‌పై బ‌యోపిక్ తీస్తే మంచి స్పందనే వ‌స్తుంది.

  • Loading...

More Telugu News