: లా పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డ గుంటూరు మాజీ ఎమ్మెల్యే


టెన్త్, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కాపీలు కొడుతూ పట్టుబడటం అందరికీ తెలిసిందే. కానీ, ఓ ఎమ్మెల్యేగా సేవలందించిన వ్యక్తి, న్యాయ పరీక్షలు రాస్తూ కాపీ కొట్టి పట్టుబడ్డాడు. అది కూడా ఎక్కడో మరో రాష్ట్రంలో కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ లోనే! పట్టుబడిన వ్యక్తి లా మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్న గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ. నేడు పరీక్షలకు హాజరైన ఆయన, తనిఖీ చేస్తున్న అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఆయన జవాబు పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. మస్తాన్ వలీతో పాటు కాపీ కొడుతున్న మరో ఇద్దరు అభ్యర్థులను కూడా స్క్వాడ్ బృందం పట్టుకుంది.

  • Loading...

More Telugu News