: జర్నలిస్టుల తప్పు లేకుంటే కేసులు ఎందుకు పెడతాము?: ఏపీ డీజీపీ రాముడు


నవ్యాంధ్ర రాజధాని భూములకు సంబంధించి వార్తలు రాసిన జర్నలిస్టుల తప్పులేకపోతే వారిపై కేసులు ఎందుకు పెడతామని ఏపీ డీజీపీ జేవీ రాముడు ప్రశ్నించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘మాకేమన్నా కేసులు లేక జర్నలిస్టులపై కేసులు పెట్టామా? సమాజంలో ఒక హోదా ఉన్న వ్యక్తులపై నిరాధారమైన వార్తలు రాయకూడదు. ఒకవేళ ఆ పని చేస్తే కనుక, వార్తలు రాసిన వారే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. జర్నలిస్టుల తప్పుందా? లేదా? అనే విషయమై విచారిస్తున్నాము’ అని రాముడు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News