: ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల్లో మనోళ్లు
టైమ్స్ మ్యాగజైన్ అత్యంత ప్రతిభావంతులైన జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు స్థానం దక్కింది. ‘టైమ్స్ 100’ పేరిట అత్యంత ప్రతిభావంతుల జాబితాను వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. సాంకేతిక రంగం నుంచి గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓలు వరుసగా సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. ఇంకా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న వారి వివరాలు... మత గురువు పోప్ ఫ్రాన్సిస్, జర్మనీ వైస్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మయన్మార్ ఎన్ఎల్ డీ పార్టీ అధ్యక్షురాలు ఆంగ్ శాన్ సూకీ, ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్, హ్యారీ పోటర్ రచయిత జేకే రోలింగ్, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ తదితర ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. కాగా, గత ఏడాది ‘టైమ్స్’ జాబితాలో యూఎస్ అధ్యక్షుడు ఒబామా, ప్రధాని మోదీ చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే!