: నేను సల్మాన్ కి బాడీగార్డుగా ఉంటా: రణ్ వీర్ సింగ్


బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్... ఇలా పరిశ్రమ ఏదైనా సినీ రంగానికి ఫిట్ నెస్ పాఠాలు నేర్పింది మాత్రం కండల వీరుడు సల్మాన్ ఖాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే, వర్థమాన హీరోలందరికీ ఫిట్ నెస్ లో సల్మాన్ ఖానే ఆదర్శం. అలాంటి సల్లూభాయ్ కి బాడీ గార్డుగా ఉంటానని బాలీవుడ్ 'బాజీరావ్' రణ్ వీర్ సింగ్ ఆంకాక్ష వ్యక్తం చేశాడు. తాజాగా ముంబైలో టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ షో హోస్ట్ పలువురు ఆహూతులతో మాట్లాడుతూ, మీకు బాడీగార్డ్ గా ఎవరైతే బాగుంటారని భావిస్తున్నారని ప్రశ్నించారు. దీనికి అత్యధికులు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ గా ఉంటే బాగుంటుందన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. దీనిపై యువనటుడు రణ్ వీర్ సింగ్ మాట్లాడుతూ, అంతా సల్మాన్ ను బాడీగార్డుగా ఎందుకు కోరుకుంటున్నారో తనకు తెలియదు కానీ, తాను మాత్రం సల్మాన్ ఖాన్ కు బాడీగార్డ్ గా ఉండడాన్ని ఇష్టపడతానని అన్నాడు. దీంతో అంతా ఆయనను చప్పట్లతో అభినందించారు.

  • Loading...

More Telugu News