: తుపాను వెలిసింది... ప్రశాంతంగా ఉన్న హెచ్సీయూ!
రెండు రోజుల తీవ్ర ఉద్రిక్తత అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఈ ఉదయం ప్రశాంత వాతావరణం కనిపించింది. విద్యార్థుల నినాదాలు, సభలు కనిపించలేదు. 10 హాస్టల్స్ కు సంబంధించిన మెస్ లు ప్రారంభమయ్యాయి. అధ్యాపకులంతా విధులకు వచ్చారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బందోబస్తును కొనసాగిస్తూ, ఐడీ కార్డులున్న విద్యార్థులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. కన్నయ్య కుమార్ విజయవాడకు వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరిన తరువాతనే దశలవారీగా బందోబస్తును తొలగిస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, నిన్న వైస్ చాన్స్ లర్ పై దాడికి దిగిన 27 మందిని విడిచి పెట్టాలని కోరుతూ, రోహిత్ వేముల తల్లి నేడు కూడా ధర్నాకు దిగుతానని ప్రకటించడంతో అదుపులో ఉన్న పరిస్థితి దిగజారకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.