: 'క్రోమ్ లాంచర్'ను తొలగించే పనిలో గూగుల్
ఇకపై డెస్క్టాప్పై, స్మార్ట్‌ఫోన్ హోమ్ పేజ్‌పై గూగుల్ క్రోమ్ లాంచర్ యాప్ కనుమరుగుకానుంది. ఫోన్లలో బ్యాటరీ డౌన్ అయిపోవడం, ఆపరేటింగ్ సిస్టమ్ స్లో అవ్వడం వంటి ఫిర్యాదులు వస్తోన్న నేపథ్యంలో గూగుల్ క్రోమ్ లాంచర్‌ను తొలగించనున్నట్లు సదరు సంస్థ పేర్కొంది. క్రోమ్ లాంచర్‌ను రిమూవ్ చేసే పనులు కొన్ని వారాల్లో ప్రారంభం కానున్నాయని సంస్థ తెలిపింది. జూలై నుంచి ఈ నిర్ణయం అమలు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. నెటిజన్లకు ఇది షాకింగ్ న్యూసే. క్రోమ్ లాంచర్ నుంచి విండోస్, మ్యాక్, లైనెక్స్ యాప్‌ల వినియోగదారులు సులభంగా ఆయా యాప్‌లను బ్రౌజ్ చేసేందుకు లాంచర్‌ను వినియోగించే వారు. జులై నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి గూగుల్ క్రోమ్ యాప్ లాంచర్‌ను డౌన్లోడ్ చేసుకోవడం వీలుకాదు. లాంచర్ లేకపోయినా క్రోమ్ యాప్‌లు బుక్ మార్క్స్ బార్ లోని యాప్ షార్ట్ కట్ ద్వారా గానీ, క్రోమ్ లో టైప్ చేసి గానీ ఓపెన్ చేయవచ్చని గూగుల్ తెలిపింది.