: కుచ్ మత్ కరీయే... చోడ్ దీజీయే: కేకలు పెట్టిన కన్నయ్య కుమార్


తనపై చెప్పు విసిరిన వ్యక్తిని వదిలివేయాలని, ఏమీ చేయవద్దని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ పెద్దగా కేకలు పెట్టారు. ఈ ఉదయం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కన్నయ్య మాట్లాడుతూ, తనకు తెలుగు రాదని, కానీ తెలుగులో దళితులను ఉద్దేశించి 'గాడు' అన్నపదం ఎక్కువగా వాడతారని తెలుసునని అంటున్న సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి చెప్పు విసిరాడు. ఆ వెంటనే అక్కడున్న వామపక్ష సంఘాల యువకులు కోపంతో అతన్ని చుట్టుముట్టగా, "కుచ్ మత్ కరీయే... చోడ్ దీజియే" (ఏమీ చేయవద్దు... వదిలేయండి) అంటూ పదేపదే అరిచారు. ఈలోగానే అతనిపై పడ్డ కొందరు యువకులు పిడిగుద్దులు కురిపించారు. ఆపై రంగప్రవేశం చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News