: భానుడి ప్రకోపానికి పిట్టల్లా రాలుతున్న జనం!
ఎండ వేడిమికి తాళలేక వడదెబ్బ తగిలి తెలుగు రాష్ట్రాల ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో 13 మంది భానుడి ప్రకోపానికి ప్రాణాలు వదిలారు. నిన్న ఒక్కరోజులో తెలంగాణలో 10 మంది మృతిచెందగా, నేడు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మరణించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం, రామన్నగారి పాలెంలో వెంకయ్య అనే వ్యక్తి, వెంకటరామరాజు పేటలో విజయమ్మ అనే మహిళ పొలం పనుల నిమిత్తం వెళ్లి అక్కడే కుప్పకూలారు. మరోవైపు ఖమ్మం జిల్లా అశ్వారావు పేట మండలం నారావారి గూడెంలో ఓ వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. ఎండలు అధికంగా ఉంటాయని, ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.