: పోలవరంలో నీరు పారించి జగన్ నోరు మూయిస్తాం: ఏపీ మంత్రి దేవినేని ఉమ
2018 నాటికి పోలవరంలో నీరు పారించి జగన్ నోరు మూయిస్తామని మంత్రి దేవినేని ఉమ అన్నారు. గత పాలకులు జలయజ్ఞం పేరుతో అవినీతి పారించిన కాలువల్లో తాము నీరు పారిస్తామని అన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులపై దేవినేని సమీక్షించారు. వంశధార,నాగావళి నుంచి విశాఖకు తాగునీరందిస్తామని, పంటలను కాపాడతామని హామీ ఇచ్చారు. తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై జగన్ మాట్లాడుతున్న తీరుపై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడే తీరు సవ్యంగా లేదన్నారు. ఏపీ ఎండల విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. గత రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరిగిందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని దేవినేని సూచించారు.