: 'భారత్ మాతాకీ జై' అని నిన‌దించేందుకు చట్టం చేయాలి: బాబా రామ్‌దేవ్‌


దేశంలో పౌరులంద‌రూ "భారత్ మాతాకీ జై" అని నిన‌దించాలని, దీని కోసం ఓ చట్టం చేయాలని యోగాగురు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. వడోదర విమానాశ్రయంలో ఆయ‌న మాట్లాడుతూ.. మత ఘర్షణలు త‌గ్గించ‌డానికి దేశ‌వ్యాప్తంగా గోవధపై సంపూర్ణ నిషేధాన్ని విధించాలని చెప్పారు. దానితో పాటు "భార‌త్ మాతాకీ జై" అని ప్ర‌తీ భార‌తీయుడు నిన‌దించేలా చ‌ట్టం చేయాల‌న్నారు. అప్పుడే దేశంలో మత సామరస్యం సాధ్య‌ప‌డుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. భారత రాజ్యాంగంలో లేకపోయినప్పటికీ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ భారత మాతాకీ జై అనాల్సిందేననీ, అందుకు వారికి ఎటువంటి ఇబ్బందీ ఉండకూడదనీ రామ్‌దేవ్‌ అన్నారు. 18 శతాబ్దం వ‌ర‌కు భార‌త్‌లో గోవ‌ధే లేద‌ని అన్నారు. మొగ‌ల్ చ‌క్ర‌వర్తి ఔరంగ‌జేబ్ సైతం గోవ‌ధ‌పై సంపూర్ణ‌ నిషేధం విధించార‌ని పేర్కొన్నారు. సున్నిత రాష్ట్ర‌మైన‌ ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోనూ ప్ర‌స్తుతం గోవ‌ధపై నిషేధం విధించిన విష‌యాన్ని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News