: బంగ్లాదేశ్‌తో ఒప్పందం చారిత్రాత్మకం: ప్రధాని మోదీ
బంగ్లాదేశ్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ.. ఈ ఒప్పందం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. తద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో టెలికామ్ సేవ మరింత మెరుగుపడుతుందన్నారు. బంగ్లాతో ఏర్పడిన ఈశాన్య గేట్‌వే అస్సాం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు కనెక్టివిటీని ఏర్పరచిందన్నారు. బంగ్లాదేశ్, భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని చెప్పారు. దీనికోసం అగర్తలాలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ ద్వారా కనెక్టివిటీని ఏర్పాటు చేస్తారు. దీనికోసం భారత్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ బంగ్లాదేశ్ సబ్‌మెరైన్ కేబుల్ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా బుధవారం నుంచి బంగ్లాదేశ్‌కు భారత్ 100 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడం ప్రారంభించింది. బదులుగా ఆ దేశం 10 జీబీపీఎస్ ఇంటర్‌నెట్ బ్యాండ్‌విడ్త్‌ను అందించనుంది.