: ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు: బంగ్లా కెప్టెన్ మోర్తాజా


భారత్ తో టీ-20 క్రికెట్ పోరులో చివరి మూడు బంతుల కారణంగానే తాము ఓడిపోయామని, ఇలా జరుగుతుందని అనుకోలేదని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫీ మోర్తాజా వ్యాఖ్యానించారు. మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే విజయం ఖాయమన్న సమయంలో నాలుగు వికెట్లు చేతుల్లో ఉండి కూడా తాము లక్ష్యాన్ని చేరుకోలేక పోయామని ఆయన అన్నాడు. ఒత్తిడిలో తమ ఆటగాళ్లు సింగిల్స్ కోసం ప్రయత్నించకుండా షాట్లు ఆడేందుకు ట్రై చేయడమే ఓటమికి కారణమని విశ్లేషించాడు. "చివరి మూడు బాల్స్ కు ముందు వరకూ విజయం మా వైపే ఉంది. మేము సింగిల్స్ తీసి ఉండాల్సింది. బ్యాడ్ లక్. మేం మూడు వికెట్లు కోల్పోయాం. ఇది నిజంగా దురదృష్టమే. మొత్తం మీద పాక్ పై మినహా మిగతా అన్ని మ్యాచ్ లలో బాగానే ఆడాం. ఈ రోజు మాది కాదు" అన్నాడు.

  • Loading...

More Telugu News