: అనంతపురం జిల్లా వైకాపా సర్పంచి ఇంట్లో బాంబు పేలుడు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సర్పంచి ఇంట్లో బాంబుపేలుడు స్థానికంగా అలజడి సృష్టించింది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం శివపురం సర్పంచి నర్సింహులు ఇంట్లో బాంబుపేలింది. ఈ ఘటనలో సర్పంచికి గాయాలయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పేలుడుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.