: ఐఎస్ఐఎస్ అంతు చూడటమే మా నంబర్ వన్ ప్రయారిటీ: ఒబామా
సిరియా, ఇరాక్ దేశాలు కేంద్రంగా వేళ్లూనుకుని ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అంతు చూడటమే తమ తొలి లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. బ్రస్సెల్స్ పై దాడి చేసి 30 మందికి పైగా సామాన్యులను బలితీసుకున్న ఘటనపై ఒబామా తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదుల పట్ల అమెరికా విధానాలను సమర్థించుకున్న ఆయన, బ్రస్సెల్స్ పై దాడి చేసి 31 మంది అమాయకుల ప్రాణాలను తీయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు.